జమ్మూ కశ్మీర్ లోని రజౌరీ జిల్లాలోని బధాల్ గ్రామంలో అనూహ్యంగా 17 మంది చనిపోవడం కలకలం రేపింది. ఆ గ్రామస్తుల శరీరంలో ఆరు రకాల విషాలను కనుగొన్నట్లు దేశం వివిధ ప్రాంతాలలోని వైద్య పరిశోధన సంస్థలు పేర్కొన్నాయి. ఆ గ్రామస్తుల మృతదేహాల పోస్ట్ మార్టం, ఆ ప్రాంతం వారు భుజించిన ఆహార పదార్థుల శాంపిల్స్ ను పరీక్షించి ఈ నిర్థారణకు వచ్చాయి. కాగా, ఆ విషం ఎలా వచ్చిందో.. ఎవరు ఇచ్చారో నిగ్గుతేల్చేందుకుసీబీఐ విచారణ జరిపించాలని జమ్మూకశ్మీర్ శాసనసభ్యులు డిమాండ్ చేశారు. గ్రామస్తుల మరణాలకు బాక్టీరియా లేదా వెరల్ పరమైన అంటువ్యాధులు కారణం కాదని, క్లినికల్ నివేదికలు, ప్రయోగశాల పరిశోధనల్లో స్పష్టమైనట్లు ఆరోగ్య మంత్రి సకీనా ఇటూ అసెంబ్లీలో తెలిపారు.చండీగఢ్ వైద్య సంస్థ మృతులలో అల్యూమినియం, కాడ్మియం వంటి రసాయనాలు ఉన్నట్లు తెలిపిందని ఆమె అన్నారు. కాగా, లక్నోలోని వైద్యపరిశోధన సంస్థ అల్జికార్బ్ సల్ఫేట్, ఎసిడామప్రిడ్ , డైథైల్డి థియో కార్పమేట్, క్లోర్పెనా పైర్ వంటి రసాయనాలను కనుగొన్నట్లు తెలిపింది.