- Advertisement -
న్యూఢిల్లీ : రికార్డు స్థాయిలో 17 మంది కొత్త జడ్జిలు మూడు హైకోర్టులకు మంగళవారం నియామక మయ్యారు. గత నెల సుప్రీం కోర్టు కొలిజియమ్ వివిధ జడ్జీల పేర్లను ప్రభుత్వానికి సిఫార్సు చేసిన తరువాత నియామకాలు జరగడం మూడోసారి. అలహాబాద్, మద్రాస్, గౌహతి హైకోర్టులకు ఈ కొత్త జడ్జిల నియామకాలు జరిగాయి. వీరితోపాటు 15 మంది అడ్వకేట్లు, ఇద్దరు జుడిషియల్ ఆఫీసర్లు నియామక మయ్యారు. అలహాబాద్ హైకోర్టుకు ఎనిమిది మంది జడ్జిలు, గౌహతి హైకోర్టుకు ఐదుగురు, మద్రాస్ హైకోర్టుకు నలుగురు జడ్జిలు నియామకమయ్యారు. ఇదిలా ఉండగా గౌహతి హైకోర్టు అడిషనల్ జడ్జిలు ముగ్గురికి పర్మనెంట్ జడ్జిలుగా హోదా పెంచారు.
- Advertisement -