Thursday, January 23, 2025

విరిగి పడిన కొండచరియలు

- Advertisement -
- Advertisement -

17 people died in a landslide in Nepal

ఖాట్మండు (నేపాల్ ): పశ్చిమనేపాల్‌లో గత 24 గంటల్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 17 మంది మృతిచెందారు. సుదుర్‌పశ్చిమ్ ప్రావిన్స్ లోని అచ్ఛం జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలకు వరదలు ముంచెత్తడంతో కొండచరియలు విరిగి పడ్డాయని జిల్లా అధికారి డిపేష్ రిజాల్ చెప్పారు. తీవ్రంగా గాయపడిన 11 మందిని వైద్యచికిత్స కోసం సుర్ఖేట్ జిల్లాకు తరలించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతయిన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ ప్రావిన్స్ లోని ఏడు జిల్లాలకు అనుసంధానంగా ఉండే భీమ్‌దత్తా హైవే కూడా బాగా దెబ్బతింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News