Sunday, November 17, 2024

దక్షిణాఫ్రికాలో నరమేథానికి 17 మంది బలి

- Advertisement -
- Advertisement -

దక్షిణాఫ్రికా లోని గ్రామీణ పట్టణ ప్రాంతంలో ఇరుగుపొరుగు వారి మధ్య తలెత్తిన ఘర్షణలో సామూహిక కాల్పుల ఫలితంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతున్న మరో బాధితుని పరిస్థితి విషమంగా ఉంది. దక్షిణాఫ్రికా లోని ఆగ్నేయా ప్రాంతం తూర్పుకేప్ ప్రావిన్స్‌లో లూసికిసికీ పట్ణణంలో శుక్రవారం రాత్రి ఈ నరమేథ బీభత్సం జరిగింది. పోలీస్‌లు విడుదల చేసిన వీడియో దృశ్యాల బట్టి ఇరుగుపొరుగున ఉన్న రెండు ఇళ్ల మధ్యనే ఈ కాల్పులు జరిగినట్టు స్పష్టమవుతోంది. ఒక ఇంటిలో 12 మంది మహిళలు, ఒక వ్యక్తి హత్యకు గురికాగా, మరో ఇంటిలో ముగ్గురు మహిళలు, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని పోలీస్‌లు చెప్పారు. ఈ దారుణ మరణాల వెనుక ఉన్న దోషుల కోసం వేటాడుతున్నామని పోలీస్ అధికార ప్రతినిధి బ్రిగ్, అథ్లెండా మేథీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రపంచం మొత్తం మీద నరహత్యలు ఎక్కువగా జరిగే దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి. ఇటీవల సామూహిక కాల్పుల సంఘటనలు అధికంగా జరగడం సర్వసాధారణమైంది. కొన్ని సార్లు ఇళ్లల్లోని వారిని టార్గెట్ చేసుకుని హత్యలు కావిస్తున్నారు. గత ఏప్రిల్‌లో క్వాజులునాటల్ ప్రావిన్స్‌లో ఇరుగుపొరుగు మధ్య సామూహిక కాల్పులు జరిగి ఒకే కుటుంబానికి చెందిన పది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఏడుగురు మహిళలు కాగా, 13 ఏళ్ల బాలుడు ఒకరు ఉన్నారు. అమెరికాతో పోలిస్తే దక్షిణాఫ్రికాలో లక్షమందికి 45 శాతం వంతున నరమేథం రేటు ఉంటోంది. అమెరికాలో లక్షమందికి 6.3 శాతం వంతున నరమేథం ఉంటోంది. దక్షిణాఫ్రికాలో తుపాకీ వినియోగం సాధారణంగా నిషేధించినప్పటికీ, భారీ సంఖ్యలో అక్రమ, నమోదుకాని తుపాకీలు వాడుకలో ఉంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News