Friday, December 20, 2024

దక్షిణాఫ్రికా నైట్‌క్లబ్‌లో 17 మంది అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

17 people suspicious death at South African night club

జొహన్నెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా) : దక్షిణాఫ్రికా లోని ఈస్ట్ లండన్ సిటీ లోని ఒక నైట్ క్లబ్‌లో 17 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం తెల్లవారు జామున ఈ విషయం బయటకు వచ్చింది. ఈ క్లబ్‌లో పలు ప్రదేశాల్లో మృతదేహాలు పడి ఉన్నట్టు సమాచారం. మృతుల శరీరాలపై గాయాలు లేకపోవడంతో మరణానికి కారణాలు వెంటనే చెప్పలేమని పోలీసు అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని చెబుతున్నారు. ఈస్ట్‌లండన్ సీనరీ పార్క్‌లో ఈ సంఘటన చోటు చేసుకుందని, అక్కడున్న పరిస్థితులను అధ్యయనం చేస్తున్నామని ఈస్టర్న్ కేప్ పోలీస్ ప్రతినిధి బ్రిగేడియర్ టెంబిన్‌కోసం వెల్లడించారు. మృతుల బంధువులు ఆ ప్రాంతానికి చేరకుని తమ బిడ్డల మృత దేహాలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుల సంఖ్య 22 వరకు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News