Sunday, November 17, 2024

వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడుతాం

- Advertisement -
- Advertisement -

పాట్నా: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించడానికి తమ విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడాలని దేశంలోని 17 ప్రధాన పార్టీలు నిర్ణయించాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సహా 17 రాజకీయ పార్టీలు శుక్రవారం బీహార్ రాజధాని పాటాలో దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ సమావేశానికి ఆతిథ్యం వహించారు. సమావేశం అనంతరం విపక్ష నేతలు మీడియాతో మాట్లాడుతూ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడడానికి అన్ని పార్టీలు అంగీకరించాయని చెప్పారు.తమ మధ్య ఎంతో సానుకూలమైన చర్చ జరిగిందన్నారు. అలాగే తదుపరి కార్యాచరణ నిమిత్తం వచ్చే నెల తదుపరి సమావేశం సిమ్లాలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ‘ సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేసేందుకు పార్టీలు అంగీకరించాయి.

దీనికి సంబంధించి స్పష్టత కోసం సిమ్లాలో మరో సమావేశం నిర్వహించనున్నాం. సీట్ల పంపకాలు, పార్టీల వారీగా విభజన వంటి అంశాలపై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం’ అని నితీశ్ కుమార్ చెప్పారు. సిమ్లా సమావేశం వచ్చే నెల 10 12 తేదీలు మధ్య ఉండవచ్చని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు.‘ మేం బిజెపిని గద్ద్దె దింపేందుకు నిర్ణయించుకున్నాం. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న విశ్వాసంతో ఉన్నాం’ అని ఖర్గే తెలిపారు. ఉమ్మడి అజెండాను రూపొందించాలని తాము నిర్ణయించామని ఆయన అంటూ.. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో రాబోయే సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు. ప్రతి రాష్ట్రానికి విడిగా ఒక వ్యూహాన్ని రూపొందిస్తామని, కేంద్రంలో బిజెపిని గద్దె దించేందుకు కలిసికట్టుగా పోరాడుతామని ఖర్గే తెలిపారు. ‘ మా మధ్య కొన్ని విభేదాలు ఉండవచ్చు. మా భావజాలాన్ని కాపాడుకోవడానికి ఆ అభిప్రాయభేదాలను పక్కనపెటి ్టపోరాడేందుకు నిర్ణయించాం.

బిజెపి దాడులను ఐక్యంగా ఎదుర్కొంటాం’ అని రాహుల్ గాంధీ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ పాట్నాలో మొదలైంది ప్రజా ఉద్యమం అవుతుందని వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ వేళ బీహార్‌లో మొదలైన జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమాన్ని ఉద్దేశించి ఆమె ఈమాట అన్నారు మోడీ నేతృత్వంలోని ఈ నియంతృత్వ ప్రభుత్వం మరోసారి గెలిస్తే భవిష్యతుత్లో ఇక ఎన్నికలనేవే ఉండవని ఆమె హెచ్చరించారు. బిజెపి పాల్పడుతున్న అకృత్యాలు దారుణమని పేర్కొన్న ఆమె తమకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్ష నాయకులను టారెట్‌గా చేసుకుని ఇడి, సిబిఐలాంటి ఏజన్సీలతో దాడులు చేయిస్తోందని విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నియంతలాగా వ్యవహరిస్తోందని మమత అంటూ ‘కాలా కానూన్’కు వ్యతిరేకంగా మనమంతా కలిసి పోరాడాలని ఢిల్లీలో ఉద్యోగుల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌ను ఉద్దేశించి అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News