Tuesday, September 17, 2024

స్కూల్‌లో అగ్ని ప్రమాదం..17 మంది విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

కెన్యాలో ఒక పాఠశాల డార్మిటరీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 17 మంది విద్యార్థులు హతులయ్యారని, మరి 13 మందికి తీవ్రంగా కాలిన గాయాలు అయ్యాయని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని భావిస్తున్నట్లు వారు తెలిపారు. నైయెరి కౌంటీలోని హిల్‌సైడ్ ఎందరషా ప్రాథమిక పాఠశాలలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదానికి కారణంపై దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీస్ శాఖ అధికార ప్రతినిధి రెసిలా ఒన్యాంగో చెప్పారు. 14 ఏళ్ల వయస్సు వరకు పిల్లలకు పాఠశాలలో బోధిస్తుంటారు. అగ్ని ప్రమాదానికి గురైన డార్మిటరీలో 150 మందికిపైగా బాలురు ఉన్నట్లు విద్యా మంత్రిత్వశాఖతో పాటు నైయెరి కౌంటీ కమిషనర్ పయస్ మురుగు తెలియజేశారు.

చాలా వరకు భవనాలు చెక్కలతో నిర్మించినవి అయినందును మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. రాజధాని నైరోబికి ఉత్తరంగా 200 కిమీ దూరంలోని దేశంలో ఎగువ ప్రాంతంలో ఆ పాఠశాల ఉన్నది. పాఠశాలలో 824 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాణాలతో బయటపడిన తమ పిల్లల ఆచూకీ తీయలేకపోయిన తల్లిదండ్రులు పాఠశాల వద్ద విచార వదనాలతో కనిపించారు. అధ్యక్షుడు విలియమ్ రూటో ఈ వార్తను ‘హృదయాన్ని కలచివేసేది’గా పేర్కొన్నారు. ఇందుకు బాధ్యులైనవారిని వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News