Monday, January 6, 2025

పాక్‌లో 17 మంది తీవ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

కల్లోలిత ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సులోని తీవ్రవాద స్థావరాలపై పాకిస్తానీ భద్రతా దళాలకు చెందిన హెలికాప్టర్లు జరిపిన రెండు వేర్వేరు దాడులలో 17 మంది తీవ్రవాదులు మరణించారు. బన్నూ, ఉత్త వజీరిస్తాన్ జిల్లాలలోని స్థావరాలపై భుక్రవారం ఈ ఆపరేషన్లు జరిగినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. బన్నూ జిల్లాలోని బాకా ఖేల్ ప్రాంతంలో భద్రతా దళాల హెలికాప్టర్లు జరిపిన దాడిలో హఫీజ్ గుల్‌బహదూర్ గ్రూపునకు చెందిన 12 మంది తీవ్రవాదులు హతమైనట్లు వారు చెప్పారు. తీవ్రవాదుల స్థావరం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News