Thursday, January 23, 2025

కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఐఐటీజేఈఈకి సిద్ధమవుతున్న ఓ విద్యార్థి శనివారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఇది 11 వ మరణం కావడం కలవరం కలిగిస్తోంది. పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ లోని మోతీహారీకి చెందిన ఆయుష్ జైస్వాల్ (17) గత రెండేళ్లుగా సామ్రాట్ చౌక్ ప్రాంతంలోఉంటున్నాడు. ఐఐటీజేఈఈకి సిద్ధమవుతున్నాడు. శనివారం రాత్ర గది నుంచి అతడు బయటకు రాకపోవడంతో స్నేహితులు ఇంటి యజమానికి తెలియజేశారు.

ఎన్నిసార్లు పిలిచినా ఆయుష్ తలుపు తీయకపోవడంతో చివరకు పోలీస్‌లకు తెలియజేశారు. పోలీస్‌లు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా గదిలోఉరివేసుకుని ఆయుష్ కనిపించాడు. వెంటనే న్యూమెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. అతడి కుటుంబానికి సమాచారం అందించారు. వారు వచ్చిన తరువాత పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తామని పోలీస్‌లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News