Monday, January 20, 2025

వైద్య కళాశాల్లో 170 అస్టిసెంట్ ప్రొపెసర్ల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఆంద్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఏర్పడిన ఖాళీలను ఆర్థిక శాఖ అనుమతితో భర్తీకి సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైద్యకళాశాలల్లో 170 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. శాస్వత ప్రాతిపదికన నియామకం ఉంటుందని, వైజాగ్ ,విమ్స్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన మరో 26 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. నిరంతరం నియామకాలకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటుందని ఈ

నెల 15న వైజాగ్ విమ్స్‌లో , 18, 20 తేదీలలో విజయవాడలోని డిఎంఇలో వాకిన్ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్నట్లు బోర్డు మెంబర్ ఎం. శ్రీనివాస్‌రావు వెల్లడించారు. వివిధ స్పెషాలిటీలలో ఖాళీగా ఉన్న 144 పోస్టులను డైరెక్ట్, లేటరల్ పద్ధతిలో భర్తీకి చర్యలు తీసుకున్నట్లు, అభ్యర్ధులు ఆయా తేదీలలో నిర్ణీత ప్రదేశాలలో జరిగే వాకిన్ రిక్రూట్మెంట్ కు స్వయంగా హాజరు కావాలని సూచించారు. మార్గదర్శకాల కోసం వివరాలను https://dme.ap.nic. వెబ్ సైట్‌లో చూడవచ్చని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News