- Advertisement -
హాస్లాంగ్ (అసోం): అసోంలోని హసావో జిల్లా హాష్లాంగ్ నియోజక వర్గ పరిధిలో ఓ పోలింగ్ కేంద్రంలో 90 ఓట్లు ఉండగా 171 ఓట్లు పోలుకావడం కలకలం రేపుతోంది. ఓటర్ల జాబితాలో 90 మంది పేర్లు ఉండగా, ఈవిఎంలో మాత్రం 171 ఓట్లు పోలయ్యాయి. ఏప్రిల్ 1 న ఈ పోలింగ్ జరిగింది. దీంతో ఆ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించిన ఐదుగురు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. ఏప్రిల్ 2న సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ కాగా, ఈ విషయం సోమవారం బయటపడింది. ఈపోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అసోం శాసన సభ ఎన్నికల్లో అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయి. మొన్న బిజెపి అభ్యర్థి కారులో ఈవిఎంను తరలిస్తుండడం రాజకీయ వివాదానికి దారి తీసింంది.
171 votes polled for 90 votes in Assam
- Advertisement -