Thursday, April 3, 2025

విమానంలోని 173మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

173 more passengers, who from Rome, test Covid-19 positive

పంజాబ్ అమృత్‌సర్‌లో మరో ఇటలీ విమానం కలకలం

అమృత్‌సర్ : అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుండటం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఇటలీ నుంచి పంజాబ్ వచ్చిన ఓ విమానంలో 125 మందికి వైరస్ సోకిన విషయం కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా అదే దేశం నుంచి వచ్చిన మరో విమానంలోనూ 173 మంది ప్రయాణికులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటలీలోని రోమ్ నుంచి ఓ విమానం శుక్రవారం మధ్యాహ్నం అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అందులో 290 మంది ప్రయాణికులున్నారు. కేంద్రం నిబంధనల ప్రకారం వీరికి ఎయిర్‌పోర్టులో కొవిడ్ పరీక్షలు చేయగా 173 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో బాధితులను ఐసోలేషన్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారంనాడు ఇటలీలోని మిలాన్ నుంచి ఇదే విమానాశ్రయానికి వచ్చిన ఓ విమానంలో 125 మందికి కరోనా సోకినట్లు తేలింది. వీరికి అమృత్‌సర్‌లోని పలు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులకు తరలించారు. అయితే అధికారుల కళ్లుగప్పి ఇందులో 13 మంది ప్రయాణికులకు ఐసోలేషన్ నుంచి తప్పించుకుని పారిపోయారు. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News