- Advertisement -
అమరావతి: ఎపిలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ లో భారీగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 86,494 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 17,354 మందికి వైరస్ సోకింది. మరో 64మంది బాధితులు మరణించారు. అదే సమయంలో 8,468 మంది బాధితులు కోలుకున్నారు. ఆంధ్రలో ప్రస్తుతం 1,22,980 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,01,690కి పెరిగింది. 9,70,718 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 7,992 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
17354 new covid-19 cases reported in AP
- Advertisement -