- Advertisement -
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లో గత కొన్ని రోజులుగా అల్పసంఖ్యాక వర్గాల వారిపై ఉగ్రదాడులు జరుగుతుండటంతో కశ్మీరీ పండితుల్లో భయాందోళన మొదలైంది. దీంతో అక్కడ ఉద్యోగాలు చేస్తున్న కశ్మీరీ పండితులు తమను ట్రాన్స్‌ఫర్ చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. ఈ క్రమం లోనే శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్న 177 మంది పండిట్ టీచర్లను బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కశ్మీర్‌లో వరుస హత్యల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, శుక్రవారం ఆర్మీ చీఫ్ మనోజ్ సిన్హా, జమ్ముకశ్మీర్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశం జరిగిన మరుసటి రోజే టీచర్ల బదిలీపై ఉత్తర్వులు రావడం గమనార్హం.
- Advertisement -