- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : సచివాలయంలో ఏ కంగా 177 మంది సెక్షన్ ఆఫీసర్ల (ఎస్‌ఓలను) ఒకేసారి బదిలీ చేస్తూ ప్రభు త్వ ం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏ ప్రభుత్వం చేయ ని విధంగా భారీగా ఎస్‌ఓలను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వు లు జారీ చేసింది. 160 మం ది ఎస్‌ఓలను ఒక శాఖ నుం చి వేరే శాఖలకు బదిలీ చే యగా మరో 17 మందికి ఎస్‌ఓలుగా పదోన్నతులు కల్పిస్తూ బదిలీ చేశారు. మొ త్తంగా 177 మందిని బదిలీ చేశారు. అయితే ఈ బదిలీ ల్లో భాగంగా కొందరు ఎస్‌ఓలకు మళ్లీ ఫోకల్ టు ఫో కల్ పోస్టింగ్స్ ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
- Advertisement -