Tuesday, September 17, 2024

భారీ వర్షాలు..177 రైళ్లు రద్దు

- Advertisement -
- Advertisement -

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు వణుకుతున్నాయి. వర్షాలు, వరదల ముప్పు పెరుగుతోంది. భారీ వర్షాల వల్ల ఇప్పటికే రహాదారులు, రైళ్ళ కు భారీ నష్టం వాటిల్లింది. పలు చోట్ల రోడ్లు, రైలు పట్టాలు జలమయమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఆదివారం సాయంత్రం 7 గం.ల వరకు 177 రైళ్ళను రద్దు చేసింది. 9 రైళ్ళను పాక్షికంగా రద్దు చేయగా 120 రైళ్లను ఇతర మార్గాల్లో దారి మళ్లించింది. ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యామ్నయ మార్గాలను ఎంచుకోవాలని ద.మ రైల్వే సిపిఆర్‌ఓ శ్రీధర్ సూచించారు. రైల్వే నిలయం డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూం నుంచి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. అధికారిక సమాచారం ప్రకారం సాయంత్రం ఏడు గంటల వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సెప్టెంబర్ 1న 76 రైళ్ళను రద్దు చేశారు.

5 రైళ్ళను పాక్షికంగా రద్దుచేయగా 38 రైళ్ళను దారి మళ్ళించారు. సెప్టెంబర్ 2న 52 రైళ్ళు రద్దు కాగా 5 రైళ్లను దారి మళ్లించారు. సెప్టెంబర్ 3న 17 రైళ్లు, 4వ తేదీన 9 రైళ్లు, 5వ తేదీన 4, ఆరవ తేదీన ఒక రైలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలకు ఆటంకం కల్పించాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తల్ల పూసలపల్లి లో వరద ఉధృతికి రైల్వే ట్రాక్, విరిగి పడ్డ సిగ్నల్ పోల్ కొట్టుకుపోయింది. రైల్వే ట్రాక్ కొట్టుకు పోవడంతో సంఘమిత్ర, మచిలీపట్నం ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. వర్షాల కారణంగా కొన్ని రైళ్లను రద్దు మరికొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే దారి మళ్లించింది. ఏపీ కి వెళ్లే రైళ్ల సమాచారం కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. రైళ్ల సమాచారం తెలుసుకునేందకుకు పలు రైళ్వే స్టేషన్‌లలో హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు.

రద్దైన రైళ్ల వివరాలు
విజయవాడ – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – విజయవాడ, గుంటూరు – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్, కాకినాడ ఫోర్ట్‌లింగపల్లి, గూడూరు – సికింద్రాబాద్, భద్రాచలం – బల్హర్ష, బల్హర్ష- కాజీ పేట్, భద్రాచలం – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – భద్రాచలం, కాజీ పేట – డోర్నకల్, హైదరాబాద్ – షాలిమర్, సికింద్రాబాద్ – విశాఖ పట్నం, విశాఖ పట్నం – సికింద్రాబాద్, హౌరా – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – తిరువనంతపురం,
తిరువనంతపురం – సికింద్రాబాద్, మహబూబ్ నగర్ – విశాఖ పట్నం, లింగంపల్లి సిఎంటి ముంబాయి, సిఎంటి ముంబాయి – లింగంపల్లి, కరీంనగర్ – తిరుపతి. హెచ్‌ఎస్ నాందేడ్ విశాఖపట్టణం, మచిలీపట్నం విశాఖపట్టణం, విశాఖ పట్టణం మచిలీపట్నం, మచిలీపట్నం ధర్మవరం, ధర్మవరంమచిలీపట్నం, నర్సాపూర్‌లింగంపల్లి, లింగంపల్లి నర్సాపూర్, కాచిగూడ మిర్యాలగూడ, మిర్యాలగూడనడికుడి, నడికుడి మిర్యాలగూడ, సికిందరాబాద్ హౌరా, హైరా సికిందరాబాద్, సికిందరాబాద్ తిరువనంతపురం, తిరువనంతపురం సికిందరాబాద్, మహబూబ్‌నగర్ విశాఖపట్టణం, లింగంపల్లిసిఎస్‌టి ముంబాయి, హైదరాబాద్ విశాఖపట్టణం, విశాఖపట్టణం హైదరాబాద్

హెల్ప్‌లైన్ కేంద్రాలు,,, ఫోన్ నంబర్లు
విజయవాడ 756305697
రాజమండ్రి 08832420541
ఒంగోల్ 7815909489
తెనాలి 08644227600
నెల్లూరు 7815909469
గూడూరు 08624250795
గుడివాడ 7815909462
భీమవరం టౌన్ 7815909402
తుని 7815909479
గుంటూర్ 9701379072
నర్సరావుపేట 9701379978
నడికుడి 9701379968
నల్గొండ 9701379966
మిర్యాలగూడ 8501978404
నంద్యాల్ 9440289105
దొనకొండ 7093745898
హైదరాబాద్ 9676904334
సికిందరాబాద్ 04027786140,04027786170
కాజిపేట్ 08702576430
ఖమ్మం 08742224541, 7815955306
వరంగల్ 9063328082

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News