- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో మొత్తం 1,20,525 శ్యాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 1,771 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 13మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,02,089కి పెరిగింది.కరోనా ఇప్పటివరకు రాష్ట్రంలో 3,469మంది బాధితులు మరణించారు. ప్రస్తుతం 22,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 2,384 మంది చికిత్సకు కోలుకొగా, ఇప్పటివరకు 5,76,487మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
1771 New Corona Cases Reported in Telangana
- Advertisement -