Monday, December 23, 2024

తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17వ తేదీ చారిత్రాత్మకమైన రోజు

- Advertisement -
- Advertisement -

తుక్కుగూడ సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17వ తేదీ చారిత్రాత్మకమైన రోజు అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల కోసం 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని అమలు చేస్తామన్నారు.

రైతులకు రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని, పట్టా భూమి రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రూ.15 వేలు రైతు భరోసా కింద ఇస్తామని ఖర్గే స్పష్టం చేశారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు చెల్లిస్తామని, వరి పంటకు క్వింటాల్‌కు అదనంగా రూ.500ల బోనస్ ఇస్తామని ఖర్గే హామీ ఇచ్చారు. పేదలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని, ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందన్నారు. సోనియాగాంధీ ఓట్ల కోసం తెలంగాణ ఇవ్వలేదని, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ చట్టం చేసింది కాంగ్రెసే అని, ఆహార భద్రత చట్టం చేసి ప్రజల ఆకలి తీర్చిందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News