Wednesday, January 8, 2025

మేఘాలయ సిఎం ఆఫీసుపై దాడి: 18 మంది నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

షిల్లాంగ్: పశ్చిమ మేఘాలయాలోని తురా పట్టణంలో ముఖ్యమంత్రి కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఇద్దరు బిజెపి మహిళా మోర్చ కార్యకర్తలతోసహా 18 మందిని అరెస్టు చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయంపై జరిగిన దాడి సంఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారని ఆ అధికారి తెలిపారు.

సోమవారం రాత్రి ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న భవనంపై దాడికి పురిగొల్పారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ నాయకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తురా పట్టణాన్ని మేఘాలయాకు శీతాకాల రాజధాని చేయాలని డిమాండు చేస్తున్న అచిక్ కాన్షియస హోలిస్టికల్లీ ఇంటెగ్రేటెడ్ క్రిమ, గరో హిల్స్ స్టేట్ మూమెంట్ కమిటీ నాయకులతో ముఖ్యమంత్రి కె సంగ్మా చర్చలు జరుపుతున్న సమయంలో ఈ దాడి జరిగింది.

ఈ ఘటనలో ముఖ్యమంత్రికి ఎటువంటి గాయాలు కాలేదు. తురాలో ముఖ్యమంత్రి కార్యాలయంపై దాడి జరిపి, విధ్వంసానికి పాల్పడిన ఘటనలో ఇద్దరు మహిళలతోసహా 18 మందిని అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు. ఈ ఘటనలో 21 వాహనాలు ధ్వంసమయ్యాయని, నిందితులపై కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News