Tuesday, January 21, 2025

ఇరాక్‌లో బస్సు బోల్తా..18 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బాగ్దాద్ : ఇరాక్‌లో ఓ బస్సు బోల్తా పడిన ఘటనలో 18 మంది మృతి చెందారు. వీరు షియా యాత్రికులు అని వెల్లడైంది. యాత్రికులతో ఇరాక్ కర్బలా పట్టణానికి వెళ్లుతుండగా బస్సు అదుపు తప్పింది. బలాడ్ పట్టణం వద్ద ప్రమాదం జరిగింది. ఇరాన్, గల్ఫ్ దేశాలు, ఇరాక్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి లక్షలాదిగా ఏటా జరిగే అర్బెయిన్ యాత్రకు వెళ్లుతారు. ఎక్కువ మంది కర్బలాకు కాలినడకనే వెళ్లుతారు. ఆచారాల ప్రకారం వివిధ క్రతువులు నిర్వహిస్తారు. బస్సు ప్రమాద మృతులలో 15 మంది మగవారు, ముగ్గురు మహిళలు ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. కర్బలాకు ఇరాన్ యాత్రికులు వచ్చే ప్రవేశ ఏర్పాట్లను ఇరాక్ ప్రధాని మెహమ్మద్ ఇయా అల్ సూడాని స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News