Sunday, December 22, 2024

శ్రీలంకలో 18 మంది భారతీయ జాలర్లు అరెస్టు

- Advertisement -
- Advertisement -

శ్రీలంక జలాల్లో అక్రమంగా చేపలు పడుతున్నారనే ఆరోపణపై 18 మంది భారతీయ మత్సకారులను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసినట్లు, మూడు ఫిషింగ్ పడవలను స్వాధీనంచేసుకున్నట్లు ఆదివారం ఒక మీడియా వార్త వెల్లడించింది. శనివారం రాత్రి గాలింపులో దెల్ఫ్ దీవుల సమీపాన ఉత్తర సముద్రంలో నుంచి ఆ జాలర్లను అరెస్టు చేసినట్లు ‘ది న్యూస్ ఫస్ట్’ వార్తా పోర్టల్ తెలియజేసింది. అరెస్టయిన జాలర్లను తదుపరి న్యాయపరమైన చర్యల నిమిత్తం కంకేశన్‌తురై ఫిషింగ్ హార్బర్‌కు తీసుకువెళ్లనున్నట్లు నౌకాదళ అధికార ప్రతినిధి కెప్టెన్ గయన్ విక్రమసూరియ తెలిపారు. క్రితం వారం తమ జలాల్లో అక్రమంగా చేపల వేట సాగించారనే ఆరోపణపై నలుగురు భారతీయ జాలర్లను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసి, వారి ట్రాలర్‌ను స్వాధీనం చేసుకున్నది,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News