Monday, January 20, 2025

లోయలో కూలిన బతుకులు

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ లోని కవార్థా జిల్లాలో సోమవారం తెల్లవారు జాము న పికప్ వాహనం బోల్తాపడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అతివేగం కారణంగా వాహనం అదుపు తప్పి బోల్తాపడినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతి చెందింది. బాధితులకు తక్షణ సాయం అందిస్తామని ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు ఉపముఖ్యమంతిర అరుణ్ సావో సంతాపం తెలియజేశారు. అడవుల్లో తేయాకు సేకరించి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసిందని చెప్పారు. స్థానిక అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News