Thursday, January 23, 2025

బిహార్‌లో పిడుగులు పడి 18 మంది మృతి

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో పిడుగులు పడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో రోహ్‌టాస్ జిల్లాలో ఐదుగురు, ఆర్వాల్‌లో నలుగురు, సరస్‌లో ముగ్గురు, జౌరంగాబాద్‌లో , ఈస్ట్ చంపరాన్ జిల్లాల్లో చెరో ఇద్దరు, టంక, వైశాలి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల వంతును నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు.

పిడుగులు పడి మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతుండడంతో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రజలకు ప్రత్యేక సూచనలు చేసింది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పంటపొలాల్లోకి, వెళ్ల వద్దని, చెట్లు, విద్యుత్‌స్తంభాలు , మట్టి ఇళ్ల వద్ద నిలబడవద్దని హెచ్చరించింది. పట్టణ ప్రజలు ఖాళీ ప్రదేశాలు, షెడ్‌లు, పిక్నిక్ సెంటర్లు, టెంట్‌లకు దూరంగా ఉండాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News