Monday, January 20, 2025

మెక్సికోలో బస్సు, ఆయిల్ టాంకర్ ఢీకొని 18 మంది మృతి

- Advertisement -
- Advertisement -

18 killed in bus and oil tanker collision in Mexico

మెక్సికోసిటీ : ఉత్తర మెక్సికో సరిహద్దు లోని తమౌలీపాస్ రాష్ట్రంలో శనివారం రాత్రి ఆయిల్ టాంకర్, బస్సు ఢీకొని బస్సు లోని 18 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో వాహనాలు రెండూ పూర్తిగా దగ్ధమయ్యాయి. మెక్సికో ఉత్తరాన ఉన్న మోంటెర్రీ పట్టణం వైపు వెళ్లే జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆయిల్ టాంకర్ డ్రైవర్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతడిని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హిడాల్గో రాష్ట్రం నుంచి మోంటెర్రీ వైపు బస్సు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న టాంకర్ ఢీకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News