Sunday, February 23, 2025

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 18మంది మావోలు హతం

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నారు. ఈ కాల్పుల్లో 18మంది మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ ప్రాంతంలోని చోటేబైథియా పోలీస్ స్టేసన్ పరిధిలోని కల్పర్ అడవిలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదరుపడడంతో.. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో బిఎస్ఎఫ్ ఇన్ స్పెక్టర్ తోపాటు మరో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 10 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని.. ఘటనాస్థలంలో ఏకే 47, 7ఎల్ఎంజి, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. ప్రస్తుతం మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News