Sunday, December 22, 2024

దంతెవాడలో 18 మంది నక్సల్స్ లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో బుధవారం 18 మంది నక్సలైట్లు లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్‌లో ఒక మిలిషియా ప్లాటూన్ సెక్షన్ కమాండ్, ముగ్గురు మహిళలు ఉన్నట్లు దంతెవాడ ఎస్‌పి గౌరవ్ రాయ్ తెలిపారు. హుర్రేపాల్ పంచాయత్ మిలిషియా ప్లాటూన్ సెక్షన్ కమాండర్‌గా పనిచేస్తున్న హిడ్మా ఓయం(34)తోపాటు అదే సెక్షన్‌లో డిప్యుటీ కమాండర్‌గా పనిచేస్తున్న సంబటి ఓయం(23), నిషిద్ధ మావోయిస్టు పార్టీ కాకడి పంచాయత్ క్రాంతికారి మహిళా ఆదివాసి సంఘటన్ ఉపాధ్యక్షురాలు గంగి మడ్కం(23), హుర్రేపాల్ పంచాయత్ సభ్యురాలు హంగి ఓయం(20) లొంగిపోయిన నక్సలైట్లలో ఉన్నారు.

పోలీసులు, సిఆర్‌పిఎఫ్ అధికారుల ఎదుట 18 మంది నక్సల్స్ తమ ఆయుధాలు అప్పగించి లొంగిపోయారని ఎస్‌పి చెప్పారు. దక్షిణ బస్తర్‌లోని మావోయిస్టులకు చెందిన భైరంగఢ్, మలంగెర్ ఏరియా కమిటీలలో వీరంతా పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. మావోయిస్టుల సిద్ధాంతంలో నిస్పృహ చెంది వారంతా తమకు తాముగా లొంగిపోయారని, వారికి పునరావాస ప్యాకేజీ కల్పిస్తామని ఆయన తెలిపారు. దీంతో ఇప్పటి వరకు దంతెవాడ జిల్లాలో ్ర738 మంది నక్సలైట్లు ప్రధాన జీవన స్రవంతిలో కలిశారని ఆయన తెలిపారు. వీరిలో 177 మందిపై రివార్డులు కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News