Monday, December 23, 2024

’18 పేజెస్’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన “18పేజిస్” ఈ శుక్రవారం క్రిస్టమస్ కానుకగా థియేటర్లల్లో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో అనుపమ చేసిన నందిని కేరెక్టర్ ఆకట్టుకుంది, ఈ సినిమా క్లైమాక్స్, అలానే కొన్ని కొత్త ఫీల్ ను తీసుకొచ్చే సీన్స్, గోపి సుందర్ మ్యూజిక్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ గా మలిచాయి. దీంతో ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

అనుకున్న విజయం సాధించడంతో ఈ చిత్రబృందం ఫుల్ జోష్ లో ఉంది. శనివారం రాత్రి ఈ చిత్ర యూనిట్ సెలిబ్రిటిస్ తో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. మెగా నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్లు సుకుమార్, చందు మొండేటి, వశిష్ట, హీరోయిన్లు ప్రియాంక జవాల్కర్, ప్రియా వడ్లమాని తదితర సినీ ప్రముఖుల మధ్య ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. కాగా, ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పాటలు, ట్రైలర్ లు ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News