- Advertisement -
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రాసిన స్టోరీతో పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. న్యూ యేజ్ లవ్ స్టోరీతో యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ కంపోజ్ చేసిన సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్‌కి సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదలై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ గ్లింప్స్ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్ట్టుకుంటోంది. అతి త్వరలో ఈ ఫుల్ సాంగ్‌ని విడుదల చేస్తామని నిర్మాత బన్నీవాసు తెలిపాడు.
- Advertisement -