Monday, November 18, 2024

డిసెంబర్ 23న ’18 పేజిస్’ బ్రహ్మాండమైన విడుదల

- Advertisement -
- Advertisement -

ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ ,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “18 పేజిస్”.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ కి, శ్రీమణి సాహిత్యం అందించిన “నన్నయ్య రాసిన” పాటకు “టైం ఇవ్వు పిల్ల” అనే పాటలకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు తెలుగు సినిమాలలో సిద్ శ్రీరామ్ అంటే ఒక సంగీతం సంచలనం.తను ఏ పాట పాడిన అది ట్రెండింగ్ అవుతుంది, యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ దాటుతుంది. తన పాటలు అన్ని ఇప్పుడు ఉన్న యూత్ కి ఒక స్లో పాయిజన్ లా ఎక్కుతాయి తాజాగా గోపి సుందర్ మ్యూజికల్ మ్యాజికల్ లో శ్రీమణి రాసిన “ఏడు రంగుల వాన” పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఈ పాటను పాత్రికేయుల సమావేశంలో చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ గారు గ్రాండ్ గా రిలీజ్ చేశారు.

ఏడు రంగులు వాన.. రెండు కళ్ళల్లోన
కారణం ఎవరంటే. అక్షరాలా నువ్వే
ఇన్ని నాల్లుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా..
కారణం ఎవరంటే.. కచ్చితంగా అది నువ్వే..
పాట చాలా వినసొంపుగా ఉంది. ఈ పాటకు శ్రీ మణి అద్భుతమైన సాహిత్యం అందించారు.

అనంతరం చిత్ర సమర్పకులు

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. గత నాలుగు మాసాలుగా నెలకొక సినిమా రిలీజ్ చేస్తున్నా మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు,సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి మా ధన్యవాదాలు. సుకుమార్ నాతో ఒక విచిత్రమైనలవ్ స్టోరీ చేద్దామని చెప్పడంతో వాసు కూడా తెగ సంబరపడిపోయాడు. మేము తీసిన “18 పేజెస్” సినిమా ఒక సాధారణ మైన లవ్ స్టోరీ కాదు. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. గోపి గారు ఇప్పటి వరకు మా బ్యానర్ ఏడు సినిమాలు చేశాడు అవన్నీ మ్యూజికల్ గా బిగ్ హిట్ అయ్యాయి.ఈ సినిమాకు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. తన హృదయంలో ఆవేదన గానీ ఆ రాగం గానీ లేకపోతే ఇంతమంచి పాటలు రావు.

కార్తికేయ సినిమా తరువాత అదే జోడీతో ఈ 18 పేజెస్ సినిమా రావడం చాలా హ్యాపీ గా ఉంది.అందరూ నేను చేసే సినిమాలు చూసి ఇది అరవింద్ గారి సినిమా అంటారు కానీ అంతా బన్నీ వాసే తన టీంతో మా సినిమాలను చాలా చక్కగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు . నిఖిల్ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తాడు. నాకు న్యాచురల్ గా నటించించే అనుపమ అంటే చాలా ఇష్టం. తనను చూసినప్పుడల్లా తనలాంటి కూతురు ఉంటే బాగుండు అనిపిస్తుంది. చాలా చక్కటి సాహిత్యాన్ని అందించే లిరిసిస్ట్ శ్రీమణి మా ఫ్యామిలో మెంబెర్ అయ్యాడు.ఈ సినిమాలో అందరూ చాలా బాగా నటించారు. ఈ నెల 23 న వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మా బ్యానర్ లో వచ్చిన సినిమాలను అదిరించి నట్లే ఈ 18 పేజెస్ సినిమాను కూడా ఆదరించాలని ప్రేక్షకులను కోరుతున్నాను. గోపి సుందర్ మ్యూజికల్ మ్యాజికల్ లో శ్రీమణి రాసిన “ఏడు రంగుల వాన” పాటను సిద్ శ్రీరామ్ చాలా అద్భుతంగా ఆలపించాడు. సింబు గారు ఎంతో బిజీగా ఉన్నా మాకున్న ఫ్రెండ్షిప్ కొరకు తను ఇందులో నన్నయ్య రాసిన పాట పాడారు. అందుకు గౌరవంగా తనకు అమౌంట్ పంపినా రిటర్న్ పంపాడు.తను ఫ్రెండ్షిప్ కు ఎంత వ్యాల్యూ ఇస్తాడో తెలుస్తుంది.

హీరో నిఖిల్ కు సినిమా మీద, మ్యూజిక్ మీద చాలా నాలెడ్జ్ ఉంది. ఇందులో నిఖిల్, అనుపమ లిద్దరూ చాలా బాగా నటించారు.. అలాగే జానపద పాటలు రాసే తిరిపతి గారిని ఈ సినిమాతో లాంచ్ చేస్తున్నాము.ఈ సినిమాలో తను మంచి పాట రాశారు. ఆ పాటను ఈనెల 14 న రిలీజ్ చేస్తున్నాము.శ్రీ మణిని లాంచ్ చేసిన తరువాత తను ఎంత ఎదిగాడో ఇప్పుడు వస్తున్న తిరుపతి కూడా అదేవిదంగా ఎదగాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి మాట్లాడుతూ.. గీతా ఆర్ట్స్ లో డైరెక్షన్ చేయడం బిగ్ హనర్ గా భావిస్తున్నాను. నా గురువు సుకుమార్ గారు మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ చేద్దాం అన్నారు. అన్నట్టు తను మ్యూజిక్ లో నుండే కథను తయారు చేశారు. ఇందులో నిఖిల్, అనుపమ లు స్టార్స్ అనే ఫీలింగ్ లేకుండా చాలా న్యాచురల్ గా చాలా బాగా నటించారు. బన్నీ వాసు, అరవింద్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది. గోపి గారు మ్యూజిక్ లో ఇప్పటి వరకు వచ్చిన రెండు పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి.. ఇప్పుడు సిద్ శ్రీ రామ్ పాడిన పాటను అరవింద్ గారు లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.ఈ రోజు సాయంత్రం 5.30 కు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ నెల 23 న వస్తున్న మా చిత్రాన్ని బిగ్ హిట్ చేయాలని అన్నారు

హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ప్రతి యాక్టర్ కు గీతా ఆర్ట్స్ లో వర్క్ చేయడమనేది డ్రీమ్. ఇలాంటి మంచి కథకు నన్ను సెలెక్ట్ చేసుకొన్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. నేను చేసిన కార్తికేయకు ఇండియా వైజ్ మంచి పేరు రావడానికి కారణం ప్రేక్షకులు, మీడియానే. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. సుకుమార్ గారి రైటింగ్ లో చేయడం చాలా హ్యాపీ గా ఉంది. ఇది ఒక క్రెజీ లవ్ స్టోరీ. ఇందులో నేను సిద్దు పాత్రలో నటిస్తున్నాను. దర్శకులు సూర్యప్రతాప్ పల్నాటి చాలా బాగా తీశాడుగోపి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.. మంచి కథతో వస్తున్న ఈ సినిమాకు అందరూ ఓపెన్ మైండ్ తో రండి. సినిమా చూసిన తరువాత అందరూ కచ్చితంగా ఫ్రెష్ ఫీల్ తో బయటకు వస్తారు అలాగే ఈ 18 పేజెస్ నుండి .# loveisCrezy ను విడుదల చేయడం చాలా హ్యాపీ గా ఉందని అన్నారు.

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. దర్శకులు సూర్య ప్రతాప్ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు కథపై ఎటువంటి ఫీల్ కలిగిందో ఇప్పుడు ఆ ఫీలింగ్ డబుల్ ఐయ్యింది. ఇందులో నందిని క్యారెక్టర్ లో నటించడం జరిగింది. అందరూ నా పాత్ర డిఫరెంట్ గా ఉందని అంటుంటే చాలా హ్యాపీ అనిపించింది.. కార్తికేయ తరువాత నిఖిల్ తో మళ్ళీ చేయడం చాలా సంతోషంగా ఉంది.గోపి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారికి దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

లిరిసిస్ట్ శ్రీమణి మాట్లాడుతూ.. 100 % లవ్ తో నా జర్నీ స్టార్ అయ్యింది.ఇది నాకు హోమ్ బ్యానర్ లాంటిది. ఈ సినిమాకు మూడు పాటలు రాసే అవకాశం ఇవ్వడంతో నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది.ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు సిద్ శ్రీ రామ్ పాడిన “ఏడు రంగుల” పాట కూడా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను.నన్ను నమ్మి నాకీ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు. సంగీత దర్శకుడు గోపి సుందర్ మాట్లాడుతూ.. ఈ బ్యానర్ లో వర్క్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది.ఇందులో చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వస్తున్న ఈ చిత్రం కూడా మ్యూజికల్ గా బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News