Thursday, January 23, 2025

‘18 పేజిస్’ పెద్ద హిట్ కావాలి : అల్లు అర్జున్

- Advertisement -
- Advertisement -

జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘18 పేజిస్’. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ఈనెల 23న రిలీజ్ చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ “దర్శకుడు ప్రతాప్‌ను ‘ఆర్య’ సినిమా నుంచి చూస్తున్నా. ఇస్తే మంచి సినిమానే ఇవ్వాలని ఎదురుచూసి మరీ సినిమా చేశాడు. ‘కార్తికేయ 2’తో హిట్ కొట్టిన నిఖిల్ మంచి కాన్సెప్ట్ సినిమాలు చేస్తాడని, ఈ సినిమా మూడేళ్ల తరువాత రిలీజ్ అవుతోందని అన్నారు. ఈ సినిమా కోసం అందరూ బాగా కష్టపడ్డారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ సినిమా చాలా బాగా వచ్చిందని, థియేటర్‌కి వచ్చి సినిమా చచూడాలని అన్నారు. సుకుమార్‌కు ఒక గొప్ప ఆలోచన వచ్చి ఈ సినిమాను గీతా ఆర్ట్‌లో మా బన్నీవాసుతో కలిసి తీసినందుకు కృతజ్ఞతలు చెబుతున్నామని చెప్పారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ సూర్యప్రతాప్ ఒక చిన్న పాపల ఈ సినిమాను దాచారని ,సుకుమార్ తీసిన సినిమాలు చాలా ఇష్టమని. ఇప్పుడు ఆయన రాసిన పాత్రలో కనిపించడం నా అదృష్టమని చెప్పారు. ఈ సినిమా విజయంపై ఎంతో నమ్మకంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ వేడుకలో సుకుమార్, బన్నీవాసు, అనుపమ పరమేశ్వరన్, సూర్యప్రతాప్ పల్నాటి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News