Monday, December 23, 2024

నవలను చదివిన ఫీలింగ్‌నిచ్చే మూవీ..

- Advertisement -
- Advertisement -

‘కార్తికేయ -2’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ’18 పేజెస్’. క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ పొయిటిక్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “ఈ సినిమా ఒక నవలను చదివిన ఫీలింగ్‌నిస్తుంది. సినిమాను దర్శకుడు కూడా అలానే ఆసక్తికరంగా మలిచాడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది”అని అన్నారు.

నిఖిల్ మాట్లాడుతూ “ఈ ఏడాది టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్‌లో ‘18 పేజెస్’ ఉంటుంది. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో సందర్భానుసారంగా కామెడీ కూడా ఉంటుంది”అని తెలిపారు. దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి మాట్లాడుతూ “సినిమా చూసిన ప్రతి ఒక్కరు మాకు మేమే ప్రేమలో పడిన ఫీల్ వస్తుందని అంటున్నారు. ఇది మాకు పెద్ద ప్రశంస”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బన్నీవాసు, అనుపమ పరమేశ్వరన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News