Monday, December 23, 2024

అందంగా, ఆసక్తికరంగా “18 పేజెస్” ట్రైలర్

- Advertisement -
- Advertisement -

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “18 పేజిస్” నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ “18పేజిస్” ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవలే ఈ “18పేజిస్” టీజర్ కి, “నన్నయ్య రాసిన” అలానే “టైం ఇవ్వు పిల్ల” అనే పాటలతో పాటు రీసెంట్ గా రిలీజైన “ఏడు రంగుల వాన” అనే పాటకు కూడా అనూహ్య స్పందన లభించింది. ఈ చిత్ర ప్రొమోషనల్ కంటెంట్ సినిమాపై రోజురోజుకు ఆసక్తిని పెంచుతుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.

ట్రైలర్ ఒక కొత్త అనుభూతిని క్రియేట్ చేస్తుంది.అద్భుతమైన విజువల్స్ తో నిఖిల్ ,అనుపమ పరమేశ్వరన్ మధ్య కెమిస్ట్రీని అందంగా చూపించారు ట్రైలర్ లో. కేవలం ఇద్దరి ప్రేమికులు మధ్య జరిగే ఫీలింగ్స్ మాత్రమే కాకుండా,ఈ సినిమాలో ఆసక్తికరమైన సంఘటనలను ట్రైలర్ లో చూపించారు. “ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు,ఎందుకు ప్రేమిస్తున్నం అంటే ఆన్సర్ ఉండకూడదు” లాంటి డైలాగ్స్ ఈ ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా దర్శకుడు నుండి మరో అందమైన అద్భుతమైన ప్రేమకథ ఇది అనేలా ఉంది ఈ చిత్ర ట్రైలర్.

“18 పేజెస్” చిత్రంలోని ఇప్పటికే రిలీజైన పాటలన్నిటికి మంచి స్పందన లభిస్తుంది. ఇప్పుడు రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై ఇంకా అంచనాలను పెంచుతుంది.ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 23 న క్రిస్టమస్ కానుకగా ఈ సినిమాను విడుదలచేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News