Wednesday, January 22, 2025

బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ తుపాన్ బీభత్సానికి 18 మంది బలి

- Advertisement -
- Advertisement -

18 people died in Sitrang typhoon in Bangladesh

10,000 ఇళ్లు ధ్వంసం, 6000 హెక్టార్ల పంటలకు
1000 రొయ్యల చెరువులకు నష్టం
పది లక్షల మందికి 6925 షెల్లర్లలో ఆశ్రయం

ఢాకా : బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ తుపాన్ బీభత్సానికి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు. సోమవారం రాత్రి నుంచి వివిధ ప్రాంతాల్లో ఈ మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు. కొమిల్లాలో చెట్టుకూలి ఒక ఇంటి లోని కుటుంబం లోని ముగ్గురు,భోలా జిల్లాలో చెట్లుకూలి, నీటిలో మునిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నరాయిల్, బార్గుణ ఉపజిల్లాల పరిధిలో ఒక్కొక్కరు వంతున చనిపోయారు. చిట్టగాంగ్ జిల్లా నుంచి పసివాని మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. సిరాగంజ్ జిల్లా జమున నదిలో బోటు మునిగి తల్లి, ఆమె రెండేళ్ల కొడుకు చనిపోయారు. ఢాకాలో బహుళ అంతస్తుల భవనం కూలడంతో ఒకరు చనిపోగా, గోపాల్ గంజ్‌లో చెట్టు కూలి ఇద్దరు మహిళలు చనిపోయారు. పటౌఖాలీ లో తుపాన్ సమయంలో గల్లంతైన కార్మికుని మృతదేహం లభ్యమైంది. మున్షిగంజ్ జిల్లాలో చెట్టు కూలి తల్లి, ఆమె మైనర్‌బాలిక ప్రాణాలు కోల్పోయారు. దేశ విపత్తు నిర్వహణ యాజమాన్య మంత్రి ఎనాముర్ రెహ్మాన్ మంగళవారం ఢాకాలో విలేఖర్లతో మాట్లాడుతూ బంగ్లా దేశ్‌లో మొత్తం 10,000 ఇళ్లు ధ్వంసం అయ్యాయని చెప్పారు. 6000 హెక్టార్ల పంటలు, 1000 రొయ్యల చెరువులు దెబ్బతిన్నాయని తెలిపారు. దాదాపు 6925 తుపాన్ షెల్టర్లలో పది లక్షల మంది నిర్వాసితులకు ఆశ్రయం కల్పించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News