Monday, December 23, 2024

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 18 మందికి జరిమానా

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట పట్టణం ట్రాఫిక్ పోలీస్ స్టెషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టబడ్డ 18 మందికి కోర్టు జరిమాన విధించినట్లు ట్రాఫిక్ సిఐ శివశంకర్ తెలిపారు.

శనివారం జరిమానా వివరాలను ట్రాఫిక్ సిఐ తెలుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఫోర్‌విలర్ వాహనాలు 9, త్రివిలర్ వానాలు 1, టూవిలర్ వాహనాలు 8 పట్టుబడగా అందులో 11 మందికి కేవలం 2000 రూపాయల జరిమానా, 6 మందికి 2000 రూపాయల జరిమానతో పాటూ ఒక రోజు జైల్ శిక్ష, ఒక్కరికి 2000 రూపయలతో పాటూ 2 రోజులు జైల్ శిక్షను కోర్టు విధించినట్లు తెలిపారు. మోత్తం రూ. 36,000 జరిమానాలు వాహనాదారులకు పడినట్లు తెలిపారు.

వాహనాదారులు ట్రాఫిక్ నిబధంనలు ఉల్లగించి వాహనాలు నడిపిస్తే చట్టరిత్య చర్యలు తప్వవని అన్నారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అదనపు ఇన్సెక్టర్ యాదగిరి,ఎస్సై శ్రీనివాస్, లక్ష్మీనారాయణ,రాజు, శివకుమార్, మహేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News