- Advertisement -
గాజా స్ట్రిప్‌పై గురువారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, హమాస్ నేతృత్వం లోని ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు. గురువారం తెల్లవారు జామున మొదట ఇజ్రాయెల్ ప్రకటించిన మానవతా జోన్ లోని మువాసీ శిబిరంపైనే వైమానిక దాడి జరిగింది మరోదాడి గాజాస్ట్రిప్ లోని ఎనిమిది మంది పాలస్తీనియన్లను బలిగొంది. మృతులు స్థానికంగా కాన్వాయ్‌ల నుంచి నిర్వాసితులకు సహాయం అందించే సభ్యులని అల్ ఆక్సా మార్టైర్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ దాడులపై ఇజ్రాయెల్ ఇంతవరకు స్పందించలేదు.
- Advertisement -