Thursday, December 5, 2024

భారీ పేలుడులో 18వేల గోవుల మృత్యువాత

- Advertisement -
- Advertisement -

హుస్టన్: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన భారీ పేలుడు ధాటికి గోవులు మృత్యువాత పడ్డాయని అధికారులు గురువారం తెలిపారు. సోమవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఓ వ్యవసాయ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. టెక్సాస్ చరిత్రలో ఇదే ఘోర అగ్నిప్రమాదంగా స్థానిక అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తు అనంతరం ఈ ఘటనకు కారణం వెల్లడిస్తామని దీనికి కొంతసమయం పడుతుందని టెక్సాస్ అగ్రికల్చర్ కమిషనర్ సిద్ మిల్లర్ ఓ ప్రకటనలో తెలిపారు.

Also Read: కాలివంతెన కూలి 40మందికి గాయాలు

డెయిరీఫాంలోని యంత్రాలు వేడెక్కడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో అంచనావేస్తున్నారు. టెక్సాస్ సమీపంలోని డిమ్మిట్ పట్టణంలో ఉన్న సౌత్‌ఫోర్క్ డైరీఫారంల్లో భారీ పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి. పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని చిక్కుకుపోయిన వ్యక్తిని రక్షించినట్లు కాస్ట్రో కంట్రీ కార్యాలయంలో ఫేస్‌బుక్ వేదికగా తెలిపింది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News