Saturday, December 21, 2024

గుజరాత్‌లో ఎన్నికల బహిష్కరణకు 18 గ్రామాల పిలుపు

- Advertisement -
- Advertisement -

 

గాంధీనగర్ : గుజరాత్‌లో ఎన్నికల బహిష్కరణకు 18 గ్రామాల ప్రజలు పిలుపునిచ్చారు. ఈ 18 గ్రామాలు బీజేపీకి కంచుకోట అయిన నవ్‌సారి నియోజక వర్గం పరిధి లోనివి. అంచెలి రైల్వే స్టేషన్‌లో లోకల్ రైళ్లను ఆపకపోవడమే వీరిని ఎన్నికల బహిష్కరణకు దారి తీసింది. చాలా కాలంగా కోరుతున్నా పట్టించుకోక పోవడంతో ఈసారి గట్టి నిర్ణయం తీసుకుని అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తున్నారు.

ఈ గ్రామాలలో పోల్‌బాయ్‌కాట్ బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. ఇక్కడి ప్రజల డిమాండ్ కారణంగా ఈ గ్రామాల్లో ప్రచారం చేపట్టేందుకు అధికార బీజేపీ నాయకులు జంకుతున్నారు. అంచెలి రైల్వేస్టేషన్ సమీపంలో “ట్రెయిన్ నహీతో వోట్ నహీ ” అంటూ బ్యానర్లు వెలిశాయి. ప్రచారానికి బీజేపీ, ఇతర పార్టీలు ఏవీ రావొద్దని, మా డిమాండ్లు నెరవేరడం లేదని, ఎన్నికలను బహిష్కరిస్తున్నామని బ్యానర్లపై స్పష్టంగా రాశారు.

అంచెలి స్టేషన్‌లో లోకల్ రైళ్లను ఆపకపోవడంతో ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కార్యాలయాలు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లాలంటే నడిచి వెళ్లాల్సి వస్తుందని కాలేజీ విద్యార్థి పటేల్ ఆందోళన వెలిబుచ్చారు. గతంలో ఇక్కడ రైళ్లు ఆగేవని, కరోనా వ్యాప్తి నుంచి రైళ్లను ఆపడం లేదని ఇక్కడి వారు చెబుతున్నారు. అందుకే ఎన్నికలను బహిష్కరించి ఖాళీ ఈవీఎం లను తిప్పి పంపి బీజేపీ ప్రభుత్వానికి, రైల్వే అధికారులకు సమస్య తెలిసేలా చేస్తున్నట్టు జెడ్‌ఆర్‌సీసీ సభ్యుడు చోటుభాయ్ పాటిల్ వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News