కచ్ జిల్లాలో 540 అడుగుల లోతు బోర్‌బావిలో పడిపోయిన 18 ఏళ్ల యువతిని 33 గంటలపాటు శ్రమించి వెలుపలికి తెచ్చారు. కానీ మంగళవారం ఆమె ఆసుపత్రిలో చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. భుజ్ తాలూకాలోని కందేరై గ్రామంలో ఆ యువతి సోమవారం ఉదయం 6.30 గంటలకు పడిపోయింది. 490 అడుగులో చిక్కుకుపోయింది. దాంతో ఆమెను కాపాడడానికి పాలకవర్గం మల్టీ ఏజెన్సీ రెస్కూ ఆపరేషన్ చేపట్టింది. సాయంత్రం 4.00 గంటలకు ఆ టీనేజ్ యువతిని వెలుపలికి తెచ్చారు. ‘దురదృష్టం కొద్దీ ఆ యువతి బతకలేదు. ఆసుపత్రికి తెచ్చేలోగానే చనిపోయింది’ అని భుజ్‌లోని జికె జనరల్ ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు.
బావి నుంచి ఆ యువతిని ‘హుక్ టెక్నిక్’ ద్వారా వెలుపలికి తెచ్చినట్లు అధికారి ఒకరు తెలిపారు. కాగా రాష్ట్ర నీటి సరఫరా, మురుగునీరు బోర్డు అధికారి ఒకరు ఆ యువతిని ‘మేక్ షిఫ్ట్ కాంట్రాప్షన్’ ద్వారా వెలుపలికి తెచ్చినట్లు తెలిపారు. రెస్కూ ఆపరేషన్‌లో జాతీయ విపత్తు ప్రతిస్పందన బలగం(ఎన్‌డిఆర్‌ఎఫ్), సరిహద్దు భద్రతా బలగం(బిఎస్‌ఎఫ్), భుజ్ మున్సిపాలిటీకి చెందిన అగ్నిమాపక దళం, స్థానిక అత్యవసర ప్రతిస్పందన, పోలీసు, స్థానిక అధికారుల బృందాలు పాల్గొన్నాయి.