Friday, December 20, 2024

అమెజాన్‌లో 18వేల ఉద్యోగులపై వేటు

- Advertisement -
- Advertisement -

 

న్యూయార్క్: ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ గతంలో ప్రకటించిన ఉ ద్యోగుల తొలగింపు ప్రక్రియను ఈ నెల నుంచి ప్రారంభించనుంది. దాదాపు 18 వేల మంది ఉద్యోగులను తొలగించబోతోంది. అమెజా న్ సిఇఒ ఆండీ జెస్సీ పబ్లిక్ స్టాఫ్ నోట్‌లో ఈ విషయాన్ని వెల్లడించా రు. గత కొన్నేళ్లుగా అమెజాన్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంది. అయితే ఇప్పుడు మాం ద్యం భయాల నేపథ్యంలో ఉద్యోగులను తగ్గించాలని నిర్ణయించిం ది. ఈ తొలగింపుతో చాలా టీమ్ లు ప్రభావితమవుతాయి. లేఆఫ్ లో అత్యధిక సంఖ్యలో అమెజాన్ స్టోర్‌లు, పీపుల్, ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ (పిఎక్స్‌టి) బృం దం నుంచి ఉన్నారు. గతేడాది న వంబర్‌లో మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ చివరి నాటికి అమెజాన్‌లో 1.5 మిలియన్ల ఉద్యోగులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News