మరో 1813 కేసులు నమోదు…
జిహెచ్‌ఎంసిలో 179, జిల్లాల్లో 1634 కేసులు
5,96,813కు చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 1813 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 179 మంది ఉండగా ఆదిలాబాద్ 6, కొత్తగూడెం84, జగిత్యాల 38, జనగామ 22, భూపాలపల్లి 39, గద్వాల 24, కరీంనగర్ 84, ఖమ్మం 180, ఆసిఫాబాద్ 12, మహబూబ్‌నగర్ 40, మహబూబాబాద్ 65, మంచిర్యాల 58, మెదక్ 17, మల్కాజ్‌గిరి 89, ములుగు 39, నాగర్ కర్నూల్ 34, నల్గగొండ 145, నారాయణపేట 18, నిర్మల్ 9, నిజామాబాద్ 21, పెద్దపల్లి 74, రాజన్న సిరిసిల్లా 33, రంగారెడ్డి 109, సంగారెడ్డి 39, సిద్ధిపేట్ 52, సూర్యాపేట్ 91, వికారాబాద్ 42, వనపర్తి 35, వరంగల్ రూరల్ 30, వరంగల్ అర్బన్ 64, యాదాద్రి భువనగిరి లో 35 కేసులు తేలాయి. అదే విధంగా వైరస్ దాడిలో మరో 17మంది చనిపోగా, ఇప్పటి వరకు వైరస్ దాడిలో మరణించిన వారి సంఖ్య 3426కు చేరింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 5,96,813కు చేరగా.. డిశ్చార్జ్‌ల సంఖ్య 5,69,086కి పెరిగింది. అయితే ప్రస్తుతం 24,301 యాక్టివ్ కేసులుండగా, 85 శాతం మంది ఐసోలేషన్ సెంటర్లలోనే చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పాటు ఆసుపత్రుల నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరిగిందని డాక్టర్లు అంటున్నారు. దీంతోనే రాష్ట్రంలో రికవరీ రేట్ 95.35 శాతం నమోదవుతుంది.
1813 New Corona Cases Reported in Telangana