న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. 20 వేల దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. అంతక్రితం రోజుతో పోల్చితే కేసులు, మరణాలు స్వల్పంగా తగ్గాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం 19 వేకు పైగా కేసులు నమోదవ్వగా, ఆదివారం 18 వేలకు తగ్గాయి. దేశంలో కొత్తగా 18,166 కేసులు వెలుగు లోకి వచ్చాయి. 214 రోజుల కనిష్ఠానికి అవి చేరాయి. శనివారం 214 మంది కరోనాతో మృతి చెందగా, ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,50,589 కి చేరింది. కొత్త కేసులు కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. గత 23 గంటల్లో 23,524 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3.32 కోట్లు దాటి దీని రేటు 97.89 వాతానికి చేరింది. ఇక క్రియాశీల కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో 2,30,971 ( 0.68 శాతం) యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 94.7 కోట్లు టీకా డోసులు పంపిణీ అయ్యాయి. త్వరలో రెండు కోట్ల సంఖ్య దాటేందుకు రాష్ట్రాలు సమాయత్తం కావాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.
214 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -