Wednesday, January 22, 2025

182 మంది ఉక్రెయిన్ బాధితుల తరలింపు

- Advertisement -
- Advertisement -

182 Indians stranded in Ukraine reached Mumbai

బుచారెస్ట్ నుంచి ముంబై చేరుకున్న విమానం

ముంబై: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 182 భారతీయులతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రొమేనియా రాజధాని బుచారెస్ట్ నుంచి మంగళవారం ఉదయం ముంబై చేరుకుంది. బుచారెస్ట్ నుంచి 182 మంది భారతీయులతో బయల్దేరిన ఎఐ ఎక్స్‌ప్రెస్ విమానం ఐఎక్స్-1202 కువైట్ మీదుగా ఉదయం 7.45 గంటలకు ముంబై విమానాశ్రయానికి చేరుకున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. రష్యా చేపట్టిన సైనిక చర్యల కారణంగా ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో వేలాది మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు. వారిని భారతదేశానికి తరలించేందుకు సోమవారం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుచారెస్ట్‌కు ఎయిర్ ఇండియా విమానం బయల్దేరి వెళ్లింది. ఉక్రెయిన్‌లోని భారతీయులను తరలించేందుకు బుచారెస్ట్ నుంచి ముంబైకు విమానాన్ని నడపడం ఇది రెండవసారని ప్రతినిధి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News