న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు తాజాగా 18 వేలు దాటాయి. దాంతో క్రియాశీల కేసులు లక్ష పైకి చేరాయి. బుధవారం 4.52 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 18,819 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజు కంటే కొత్త కేసులు 4 వేల మేర అధికంగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 4.16 శాతానికి చేరింది. రోజువారీ కేసులు ఈ స్థాయిలో ఉండటం 130 రోజుల తరువాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. మొత్తం కేసుల్లో ఒక్క కేరళ (4459 ).మహారాష్ట్ర (3957 )ల్లోనే 8 వేలకు పైగా కేసులు రాగా, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఢిల్లీలో వెయ్యిమందికి పైగా కరోనా బారిన పడ్డారు. క్రియాశీల కేసులు సంఖ్య లక్షదాటి, 1,04,555 కి చేరింది. యాక్టివ్ కేసుల రేటు 0.24 శాతానికి పెరగ్గా, రికవరీ రేటు 98.55 శాతానికి పడిపోయింది. బుధవారం 13,827 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య కాస్త ఎక్కువగా కనిపించింది. గత 24 గంటల వ్యవధిలో 39 మంది మరణించగా, అందులో 17 మరణాలు కేరళలోనమోదైనవే. టీకా డ్రైవ్‌లో బుధవారం 14.17 మంది వ్యాక్సిన్ వేయించుకోగా, ఇప్పటివరకు మొత్తం 197.61 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.
మళ్లీ పెరిగిన కరోనా కొత్త కేసులు… లక్షకు పైగా బాధితులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -