- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా 18 వేల దిగువనే ఉంటున్నాయి. దాంతో పాజిటివిటీ రేటు 4 శాతం పైనే వెలుగు చూస్తోంది. శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం శుక్రవారం 4.54 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 18,840 మందికి వైరస్ సోకింది. పాజిటివిటీ రేటు 4.14 శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో 43 మంది మరణించారు. తాజాగా మృతుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు 4.36 కోట్ల మందికి పైగా వైరస్ బారిన పడగా, 5.25 లక్షల మంది మృతి చెందారు. క్రియాశీల కేసులు 1,25,028 కి ఎగబాకాయి. క్రియాశీల కేసుల రేటు 0.29 శాతానికి పెరగ్గా, రికవరీ రేటు 98.51 శాతానికి పడిపోయింది. శుక్రవారం 16 వేల మంది కోలుకున్నారు. 12 లక్షల మంది టీకా తీసుకోగా, మొత్తం 198 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.
- Advertisement -