Wednesday, April 16, 2025

టెట్‌కు తొలి రోజు 1890 దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టిజి టెట్ 2025) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. తొలి రోజు 2078 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించగా, 1890 దరఖాస్తులు సమర్పించారు. వారిలో పేపర్ 1కు 558 మంది, పేపర్‌కు 2కు 1101 మంది, రెండు పేపర్లకు 231 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 30వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టెట్ ఛైర్మన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఇ.వి.నరసింహారెడ్డి వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

ఎస్‌జిటి ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్ -1, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్- 2 పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పేపర్ -2లో రెండు వేర్వేరు పేపర్లు (గణితం,-సైన్స్, సాంఘికశాస్త్రం) ఉంటాయి. ఈసారి ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000 రుసుంగా నిర్ణయించారు. టెట్‌కు ఈసారి కనీసం రెండు లక్షల మంది పోటీపడనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత జనవరిలో జరిగిన 2024 టెట్ -2 పరీక్షకు 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా, 2,05,278 మంది పరీక్ష రాశారు. వారిలో 83,711 మంది కనీస మార్కులు సాధించి డిఎస్‌సికి అర్హత పొందారు. ఈ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఒసిలకు -90, బిసిలకు -75, మిగిలిన వారికి 60 మార్కులు వస్తే ఉత్తీర్ణులవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News