Thursday, January 23, 2025

దక్షిణాఫ్రికాలో కాల్పులు: 19 మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

19 dead in Two bar shooting in South Africa

జోహన్నస్ బర్గ్: దక్షిణాఫ్రికాలో కాల్పుల మోత మారణహోమం సృష్టించింది. జోహన్నస్ బర్గ్, పీటర్ మారిట్స్ బర్గ్  లోని బార్లలోకి  కొందరు దుండగులు చొరబడి విచాక్షణరహితంగా కాల్పులు తెగపడడంతో 19 మంది చనిపోయారు. గాయపడిన వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొందరు దుండులు మిని బస్సులో జోహన్నస్ బర్గ్ లోని సోవెట్ టౌన్ షిప్ లో ఉన్న బార్ లోకి కొందరు దుండగులు ఆయుధాలతో వచ్చారు. బార్ లోకి ప్రవేశించగానే కాల్పులు జరపడంతో అందరూ పరుగులు తీశారు. 15 మంది ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన దుండగులు వెంటనే పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించామని పోలీస్ ఉన్నతాధికారి ఎలియస్ మావేలా తెలిపారు. క్షతగాత్రులలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అతి త్వరలో దుండగులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. పీటర్ మారిట్స్ బర్గ్ లోని ఓ బార్ లో దుండుగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. దక్షిణాఫ్రికా ప్రతి సంవత్సరం 20 వేల మంది హత్యకు గురవుతున్నారని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News