Tuesday, September 17, 2024

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెంపు

- Advertisement -
- Advertisement -

19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి పెరిగాయి. ఆదివారం (సెప్టెంబర్ 1) వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ల ధర రూ.39 పెరిగింది. పెరిగిన ధరలు ఈరోజు నుండి అమలులోకి వచ్చాయి.దీంతో ఢిల్లీ రిటైల్ సేల్స్ 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధర రూ. 1,691.50కు చేరుకుంది. ఇక, హైదరాబాద్‌లో రూ.1935గా ఉంది. అయితే, 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచడం ఇది వరుసగా మూడవసారి. ఆగస్టు నెలలో, చమురు మార్కెటింగ్ కంపెనీలు(OMCలు) 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలను రూ. 8.50 పెంచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News