- Advertisement -
19 మంది మృతి..పలువురికి గాయాలు
న్యూయార్క్: నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదంలో 9 మంది పిల్లలతోసహా 19 మంది మరణించారు. ఇటీవల కాలంలో నగరంలో చోటుచేసుకున్న అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదంగా అగ్నిమాపక కమిషనర్ ఈ సంఘటనను అభివర్ణించారు. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా గాయపడ్డారని, వీరిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్‌కు ప్రధాన సలహాదారు స్టీఫెన్ రింజెల్ ఆదివారం తెలిపారు. పొగ పీల్చడంతో వీరంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఆయన చెప్పారు. బ్రోంక్స్‌లో ఈస్ట్ 181 వీధిలో ఉన్న 19 అంతస్తుల భవనంలో మంటలు ఏర్పడడంతో వాటిని ఆర్పడడానికి దాదాపు 200 అగ్నిమాపక సిబ్బంది శ్రమించినట్లు ఆయన చెప్పారు. ప్రతి అంతస్తులో బాధితులు ఉన్నారని, వారంతా కార్డియాక్ అరెస్ట్, శ్వాసకోశ ఇబ్బందులకు గురయ్యారని రింజెల్ చెప్పారు.
- Advertisement -