Thursday, January 23, 2025

మదర్సాలో పేలుడు: 19 మంది మృతి

- Advertisement -
- Advertisement -

కాబూల్: ఆఫ్ఘానిస్థాన్‌లోని ఐబాక్ ప్రాంతంలో బాంబు పెలుళ్లు చోటుచేసుకున్నాయి. మదర్సాలో బాంబు పేలడంతో 19 మంది మృతి చెందగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గత సంవత్సరం ఆగస్టు నుంచి ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు పాలిస్తున్నారు. తాలిబన్ల పాలనలో సామాన్య ప్రజలు, మహిళలు నరకం అనుభవిస్తున్నారు. అప్పటి నుంచి ఎక్కడో ఒక బాంబులు పేలుతూనే ఉన్నాయి. ముఖ్యంగా షియాలు, ఖుర్ధులు లక్షంగా ఐసిస్ దాడులకు పాల్పడుతోంది. అక్కడ షరియా చట్టాలను తీసుకవచ్చి స్త్రీలకు హక్కలతో పాటు చదువుకు దూరంగా ఉంచుతున్నారు. పాకిస్థాన్‌లో క్వెట్టాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. ఈ దాడి తామే చేశామని పాకిస్థాన్ తాలిబన్ మిలిటెంట్ గ్రూప్, తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ సంయుక్తంగా ప్రకటించాయి. తాలిబన్ల పాలనలో ఆప్ఘాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ప్రజలను అన్నమో రామచంద్ర అన్నట్టుగా ఎదురుచూస్తున్నారు. ఎక్కడ చూసిన అకలికేకలు వినిపిస్తున్నాయి. ఆప్ఘాన్‌కు ఐక్యరాజ్యసమితి కూడా ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News