మావోయిస్టు పార్టీకి చెందిన 19 మంది సభ్యులు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. జిల్లా పోలీసులు, 81 బెటాలియన్, 141 బెటాలియన్, సీఆర్‌పీఎఫ్ అధికారులు, ఆదివాసీ ప్ర జల అభివృద్ది, సంక్షేమం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకొని ఇకపై తాము కుటుంబసభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని 19 మంది లొంగిపోయినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్‌రాజు వారి వివరాలను వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాకు చెందిన నరోటి మనీ ష్ అలియాస్ లోకేష్, అలియాస్ ఆకాష్, బీజాపూర్ జిల్లాకు చెందిన మడివి నంద, దంతెవాడ జిల్లాకు చెందిన మడివి హండా,
మడివి హడమ, మడకం దేవ, కలుమ ఐత, పోడియం సమ్మయ్య, పోడియం నగేష్, సోడి హర్జాన్, పోడియం అడుమ, మడకం ఉంగా, కుంజం మాస, మిర్గం సుక్కయ్య, మడివి ఇడుమయ్య, సల్వం వెంకట్, సల్వం శంకర్, మడివి కోస, దిర్దో సూల, సోడి ఇడుమ ఉన్నారన్నారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జనవరి నెలలో చర్లలో అజ్ఞాత, లొంగిపోయిన మావోయిస్టు కుటుంబ సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా పోలీసుల ఎదుట లొంగిపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, తద్వారా ప్రభుత్వం కల్పించే పథకాలతో లబ్ధి పొందాలని, కుటుంబ సభ్యులతో కలిసి జీవనం గడపాలని, పోలీస్ అధికారులు తెలియజేయడం జరిగిందన్నారు. ఆ కార్యక్రమంలో 22 మంది మావోయిస్టులు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగిందని చెప్పారు.